NewsTelangana

సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ శంకుస్థాపన

హైదరాబాద్‌లోని నానక్‌ రామ్‌గూడలో సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఫస్‌ ఫేస్‌లో భాగంగా 23 కి.మీ. వరకు నిర్మాణం చేపట్టనున్నారు. 16 మెగావాట్ల విద్యుత్పత్తి జరిగేలా సోలార్‌ రూఫ్‌తో ఈ ట్రాక్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని హెచ్‌ఎండీఏ ప్రయత్నం మొదలుపెట్టింది. నానక్ రాం గూడ నుంచి టీ.ఎస్.పీ.ఎస్ వరకు… నార్సింగి నుంచి కొల్లూరు వరకు సర్వీసు రోడ్లకు ఇరువైపులా పచ్చదనంతో ఈ ట్రాక్ ను నిర్మించనున్నారు. సాధారణ సైకిల్ ట్రాక్ మాదిరిగా కాకుండా ఆధునిక వసతులతో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… పర్యావరణానికి అనుకూలంగా ఉండే.. ప్రజా ఉపయోగమైన నాన్ మోటరైజ్ ట్రాన్స్ పోర్ట్ సెల్యూషన్స్ ను ఉద్దేశంతో ఈ ట్రాక్ ను నిర్మిస్తున్నామన్నారు. అందరికీ ఫిజికల్ ఫిటెనెస్ పై ఆసక్తి పెరిగిందన్నారు. 24 గంటలు ఈ ట్రాక్ అందుబాటులో ఉంటుందని, ఇండియాలో తొలిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.