ఫార్ములా- ఈ- కార్ రేసు కేసులో కీలక పరిణామం..
తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. వివరాలు అందిన వెంటనే కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కేసును క్వాష్ చేయాలంటూ ఇప్పటికే కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

