ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం
బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆరోపిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యంగా ఈ కేసులో ఫిర్యాదు చేసిన పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఈ రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా నాటి ప్రభుత్వం విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ దానకిశోర్ అక్టోబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.55 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దీనితో గతంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ప్రధాన నిందితునిగా, అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

