వైసీపీకి మాజీ ఎమ్మెల్యే షాక్
వైసీపీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గుంటూరులో వైసీపీ పార్టీకి దీనితో గట్టి దెబ్బ తగిలినట్లయ్యింది. వైసీపీకి గుంటూరు నగర అధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్న మద్దాలి గిరి గతంలో 2019లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైసీపీ పార్టీలో చేరారు. కానీ ఆయనకు 2024 ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ తరపున టిక్కెట్ లభించలేదు. తన వ్యక్తి గత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు రాజీనామా లేఖ పంపారు.