నెల్లూరు సెంట్రల్ జైలుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఆయనను కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ పిన్నెల్లి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అయితే దీనిపై ఆయనకు బెయల్ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఆ సమయంలో పిన్నెల్లి టీడీపీ ఏజెంట్,సీఐపై కూడా దాడి చేశారు. దీనిపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. కాగా దీనిపై కోర్టు పిన్నెల్లికి రిమాండ్ విధించింది. ఈ కేసులో మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి పిన్నెల్లికి 14 రోజల రిమాండ్ విధించడంతోపాటు నెల్లూరు జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తమ వాహనంలోనే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.