వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు
వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో తన ఇంట్లో పనిచేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించారనే కారణంగా ఈ అరెస్టు జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కర్నూలులోని నివాసంలో ఉండగా ఆయనను అరెస్టు చేసి వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.