NewsTelangana

మహబూబ్‌నగర్‌లో వెంకయ్య పర్యటన

భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఓపిక ఉండాలన్నారు.  రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను శత్రువులుగా భావించొద్దని ఆయన సూచించారు. రాజకీయాలలో నీతిని నిజాయితీగా నమ్ముకుంటేనే ముందుకెళ్తామని తెలిపారు. ఈ మేరకు దేశంలోని ,రాష్ట్రంలోని ప్రజాప్రతినిథులు ఉన్నత ప్రమాణాలు పాటించాలన్నారు. అంతేకాకుండా అందరూ మాతృభాషను  గౌరవించాలని వెంకయ్యనాయుడు అభిలషించారు. మునుగోడు ఉపఎన్నికల వేళ వెంకయ్యనాయుడు తెలంగాణ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందనే చెప్పాలి.