Home Page SliderNational

సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన మాజీ యూపీ సీఎం

దేశరాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్,యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సీఎం కేసీఆర్‌తో తాజాగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు నేతలు దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో బీజేపీని వ్యతిరేకించే  పార్టీలలో బీఆర్ఎస్ ఒకటిగా ఉంది.  అయినప్పటికీ ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి బీఆర్ఎస్ గైర్హజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా గతంలోనూ పలుమార్లు అఖిలేష్-కేసీఆర్ సమావేశమై దేశ రాజకీయాలపై చర్చించారు.