NewsTelangana

షేక్‌పేట మాజీ తహసీల్దార్ అనుమానాస్పద మృతి

షేక్‌పేట మాజీ తహసీల్దార్ సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో ఆమె రూ.40 కోట్ల భూ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ అరెస్టు కారణంగా ఆమె భర్త గతేడాది బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో ఆమె కొంతకాలంగా మానసిక క్షోభకు గురైనట్లు తెలుస్తోంది. ఈ వరుస విషాద ఘటనలు ఆమెను తీవ్రంగా కలిచి వేశాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.