Home Page SliderNational

బీజేపీలోకి పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్ ప్రీత్‌సింగ్ బాదల్

పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మరియు కాంగ్రెస్ నాయకుడు మన్‌ప్రీత్ సింగ్ బాదల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో నిరాశ కలిగించే భ్రమ తర్వాత బీజేపీలో చేరినట్టుగా పేర్కొన్నారు. తనతో యుద్ధం చేస్తున్న పార్టీలో ఎలా పనిచేయగనని ఆయన ప్రశ్నించారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పంజాబ్‌కు చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌లు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురించి ప్రస్తావిస్తూ, రాజకీయాల్లో “సింహాన్ని” కలవడం చాలా అరుదు అని మన్‌ప్రీత్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అతని బృందం నాయకత్వంలో భారతదేశం, పంజాబ్ అభివృద్ధి చెందుతున్నాయని మన్‌ప్రీత్ తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, గత ఏడాది కాలంలో పార్టీ మారిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, మాజీ రాష్ట్ర యూనిట్ చీఫ్ సునీల్ జాఖర్‌లతో సహా పంజాబ్ కాంగ్రెస్ సభ్యుల ప్రముఖ సమూహంలో చేరారు.

అంతకుముందు, జనవరి 10న పంజాబ్‌లోకి ప్రవేశించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మన్‌ప్రీత్ కన్పించలేదు. గత ఏడాది పంజాబ్ ఎన్నికలలో, AAP జగ్రూప్ సింగ్ గిల్ చేతిలో 60,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయాడు. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూతో మన్‌ప్రీత్ విభేదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐతే మన్‌ప్రీత్ పార్టీ మార్పుపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. “అకాలీదళ్‌ని విడిచిపెట్టి, కాంగ్రెస్‌లో చేరి, ఐదేళ్లపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసి, రికార్డు స్థాయిలో 60 వేల తేడాతో ఓడిపోయి, నిద్రాణస్థితిలోకి వెళ్లిన వ్యక్తి ఇప్పుడు బిజెపిలో చేరాడు” అని ఆయన ట్వీట్ చేశారు.

మన్‌ప్రీత్ తన రాజీనామా లేఖలో, పంజాబ్‌లో పార్టీ పగ్గాలను తప్పుడు వ్యక్తులకు ఇచ్చినందుకు ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శించాడు. పార్టీ కోలుకోలేని విధంగా మార్చేశారని… పార్టీ గురించి మాట్లాడటం అనవసరమని ఆయన చెప్పుకొచ్చారు. పంజాబ్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, నిర్ణయాలు తీసుకున్న తీరు నిరుత్సాహంగా ఉందన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి పార్టీ వైఫల్యాలను మన్ ప్రీత్ సింగ్ ఎండగట్టారు. దాన్నే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “ఢిల్లీ రిట్‌ను కాంగ్రెస్ పంజాబ్ యూనిట్‌కు నిర్దేశించే అధికారం అప్పగించబడిన పురుషుల కోటరీకి చాలా దూరంగా ఉంది. ఇప్పటికే విభజించబడిన ఇంట్లో అంతర్గత విభేదాలను తగ్గించడానికి ప్రయత్నించే బదులు, ఈ వ్యక్తులు ఫ్యాక్షనిజాన్ని మరింత పెంచడానికి పనిచేశారు. విధానపరంగా పార్టీలో చాలా చెత్త అంశాలను బలపరిచారు, ”అని లేఖలో మన్‌ప్రీత్ విమర్శించారు.