కోహ్లీకీ తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: పాక్ మాజీ కెప్టెన్
ఈ IPL సీజన్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ విమర్శలు ఎదుర్కొన్నారు. కాగా IPL కామేంటేటర్ సైమన్ కోహ్లీపై విమర్శలు గుప్పించారు. ఈ నెల 10న జరిగిన మ్యాచ్‌లో LSG చేతిలో RCB ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అర్థ సంచరీ చేయడానికి ఎక్కువ బంతులు ఆడాడని కామేంటటర్ సైమన్ విమర్శించాడు. అయితే దీనిపై స్పందించిన పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సైమన్‌పై కౌంటర్ వేశాడు. కోహ్లీ ఇప్పటివరకు 75 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. అలాంటి వ్యక్తికి మైలురాళ్ల కోసమో,కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సైమన్‌కు చురకలు వేశారు. సైమన్ ఓ బౌలర్ కావడం వల్ల అతనికి ఆటపై అవగాహన తక్కువని సల్మాన్ భట్ పేర్కొన్నారు.

