మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో మరణించారు. ఆయన గతంలో మూడుసార్లు టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్న చింత కుంట మండలం పరాకాపురం ఆయన స్వస్థలం. టీడీపీ ఎమ్మెల్యే మృతికి టీడీపీ నేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు తెలంగాణా నాయకులు కూడా తమ సంతాపం తెలియజేశారు. తమ పార్టీ నుండి దయాకర్ రెడ్డి మూడు సార్లు గెలిచారని, సమర్థుడైన నాయకునిగా పేరుతెచ్చుకున్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మంచి మిత్రుడిని కోల్పోయానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. నారా లోకేష్, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి సహా పలువురు నేతలు తమ సంతాపాలు తెలియజేశారు.


 
							 
							