వైసీపీలోకి మాజీ మంత్రి
వైసీపీ పార్టీలోకి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చేరారు. ఆయన పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీలో చేరారు. వీరిని కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. శైలజానాథ్ గతంలో శింగనమల నియోజకవర్గం నుండి 2004, 2009లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. జగన్ నాయకత్వంలో ప్రజల తరపున పోరాడతానని పేర్కొన్నారు. ఆయన రాజకీయ విధానాలు నచ్చి, వైసీపీలో చేరానని తెలిపారు. రాయలసీమలో ప్రజల కష్టాలు తీర్చడానికి నా వంతు పనిచేస్తానని పేర్కొన్నారు. మరింతమంది కాంగ్రెస్ నుండి వైసీపీలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

