చంద్రబాబు పై గురుభక్తి వల్లే బనకచర్ల…
మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తూ, బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టుకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకపోయినప్పటికీ, ఇప్పుడు ఇది కాంగ్రెస్ అండతో ముందుకు సాగుతున్నదంటే ప్రజలకు వాస్తవం తెలిసినట్టేనని స్పష్టం చేశారు. తమ హయాంలోనే దీనికి వ్యతిరేకంగా పోరాటం సాగించామని, అందుకే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరుకాలేదని చెప్పారు. సాగునీటి ప్రయోజనాల పరంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కోరకపోవడం సీఎం అవగాహనలేని పాలనకు నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా చంద్రబాబు పట్ల రేవంత్ చూపిస్తున్న విధేయత ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బగా అభివర్ణించారు.