వైసీపీలోకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
గొల్లపల్లి సూర్యారావు వైసీపీలోకి చేరడం ఖాయంగా కన్పిస్తోంది. ఆయన ఇవాళ పార్టీ ముఖ్యనేత మిథున్ రెడ్డిని, కేశినేని భవన్ లో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నానితో భేటీ అయ్యారు. గొల్లపల్లి సూర్యారావుకు పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ కేటాయించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ వైసీపీ ప్రకటించింది. దీంతో గొల్లప్లలికి వైసీపీ ఎమ్మెల్సీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈక్వేషన్ కుదిరితే ఎంపీగానూ బరిలో దింపే అవకాశమున్నట్టు చెబుతున్నారు.


