Andhra PradeshNews

పవన్‌కళ్యాణ్‌పై మాజీమంత్రి అనిల్ కుమార్ ఫైర్

నెల్లూరు, మనసర్కార్

వైసీపీ మాజీమంత్రి అనిల్ కుమార్ జనసేనా అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌పై విరుచుకు పడ్డారు. ప్రభుత్వాన్ని ఉంచనంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు దత్త పుత్రుడుగా పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. సినిమాల్లో తప్పించి వైసీపీని ఏం పీకలేవన్నారు. విజయవాడ నుంచి వైజాగ్ వరకు పొర్లు దండాలు పెట్టినా ప్రభుత్వాన్ని పీకలేవంటూ దుయ్యబట్టారు. గత పదేళ్లుగా ఎవరి బాగుండాలని కోరుకుంటున్నావో.. ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని తాపత్రయపడుతున్నావో… మీ అందరూ కట్టగట్టుకు రండన్నారు. 2024 అన్ని పార్టీలు సింగిల్ ప్యాకేజీతో కట్టగట్టుకురావాలని… ప్రతిపక్షాన్ని తరిమేసే బాధ్యత వైసీపీ తీసుకుంటందన్నారు అనిల్. గత రెండు రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ రణరంగంపై ఆయన స్పందించారు. ఏపీలో వైసీపీ సర్కార్‌ను కూల్చే సత్తా పవన్‌కు లేదన్నారు. పవన్‌కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడని ఏపీ ప్రజలందరికీ తెలుసన్నారు. మీరంతా ఏకమై వచ్చినా రాబోయే ఎన్నికలలో వైసీపీదే విజయమన్నారు. వచ్చే ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి ఏపీలో ప్రతిపక్షం అన్నదే లేకుండా చేస్తామన్నారు. పవన్‌కళ్యాణ్ వెంట తిరగడం అభిమానులంతా మానుకోవాలని సూచించారు. పవన్ సీఎం అవ్వడం ఎప్పటికీ ఓ కలగానే మిగిలిపోతుందని అనిల్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యే సంగతి దేవుడెరుగు.. ఎమ్మెల్యేగా ఎలా అవ్వాలన్నది చూసుకోవాలని హితవు పలికారు.