Home Page SliderTelangana

కేటీఆర్‌ను కలిసిన ఆదిత్య ఠాక్రే

మహరాష్ట్ర మాజీమంత్రి ఆదిత్య ఠాక్రే ఈ రోజు హైదరాబాద్‌కు విచ్చేశారు. ఆయన తెలంగాణా ఐటీశాఖ మంత్రి కేటిఆర్‌‌తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే కేటిఆర్‌తో దేశాభివృద్దిపై పలు విషయాల గురించి చర్చించినట్లుగా తెలిపారు. ఠాక్రే హైదరాబాద్ టీ హబ్‌లో కేటిఆర్‌ను కలిశారు. కాగా కేటిఆర్ ఠాక్రేకు టీ హబ్ ప్రత్యేకతను,పనితీరును వివరించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు, నేషనల్ పాలిటిక్స్ ,నగరీకరణ,సాంకేతిక విషయాలపై కేటిఆర్‌తో మాట్లాడానని ఠాక్రే వెల్లడించారు. అయితే కేటిఆర్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందని ఆదిత్య ఠాక్రే ట్విటర్ వేదికగా పంచుకున్నారు. అయితే వీరి భేటి దేశరాజకీయాలలో ఎలాంటి మార్పులు సృష్టిస్తుందో వేచి చూడాల్సి వుంది. కాగా తెలంగాణా రాష్ట్ర సమితి జాతీయపార్టీగా అవతరించిన నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే  కేటిఆర్‌ను కలవడం రాజకీయాలలో ప్రాధాన్యం సంతరించుకుంది.