Andhra PradeshHome Page Slider

గన్నవరం మాజీ ఎమ్మెల్యే అరెస్టు

గన్నవరం మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన గతంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసినట్లు టీడీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ కేసులో ఆయనను హైదరాబాద్ నుండి గన్నవరం వెళ్తుండగా వాహనాన్ని వెంబడించి మరీ పోలీసులు అరెస్టు చేశారు. వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఈ కేసులో ఆయన ఏ-71గా ఉన్నారు. ఇప్పటికే ఆయన అనుచరులు యూసఫ్ పఠాన్, రమేశ్‌లను అరెస్టు చేశారు. ఇప్పటివరకూ ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. ఈ దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యేగా ఆయన అండతోనే వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని ఆరోపణలున్నాయి.