పరువు నష్టం కేసు గెలిచిన మాజీ సీఎం..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి పరువు నష్టం కేసు గెలిచారు. పళని స్వామి రూ. 1.1 కోట్లను పరిహారంగా అందుకోనున్నారు. 2017 కొడనాడు ఎస్టేట్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడి సోదరుడు ధనపాల్ చేసిన ఆరోపణలపై పళనిస్వామి కోర్టును ఆశ్రయించగా, తాజాగా ఈ కేసులో తుదితీర్పు వెలువరించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో తొలుత సెక్యూరిటీగార్డు మృతి చెందాడు. ఆ తర్వాత మరో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఎస్టేట్ సీసీటీవీ కెమెరాల ఇన్ చార్జ్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసు ఇంకా కోర్టులో
పెండింగ్ లోనే ఉంది. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడి సోదరుడు ధనపాల్.. పళనిస్వామిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనల వెనక పళనిస్వామి హస్తం ఉందని ఆరోపించారు. దీంతో పళనిస్వామి పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో తాజాగా మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది.

