బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కోల్‌కత్తాలోని నివాసగృహంలోనే 80 ఏళ్ల వయస్సులో మరణించారు. గత కొద్ది కాలంగా శ్వాససంబంధిత వ్యాధులతో బాధపడుతూ పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు సమాచారం. సీపీఎం పార్టీ నుండి బుద్ధదేవ్ భట్టాచార్య 2000 సంవత్సరం నుండి 2011 సంవత్సరం వరకూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం ప్రస్తుత ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి మమతా బెనర్జీ సంచలన విజయం సాధించడంతో 34 సంవత్సరాలుగా బెంగాల్‌ను పాలించిన కమ్యూనిస్టు పార్టీకి బ్రేక్ పడింది.