Home Page SliderNational

గులాబీ దళపతిని పరామర్శించనున్న ఏపీ మాజీ సీఎం

తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల తన నివాసంలో జారిపడిన విషయం తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని యశోధ హాస్పటల్‌లో చేర్పించారు. కాగా కేసీఆర్‌ను పరీక్షించిన వైద్యులు ఆయనకు తుంటి ఎముక విరిగిందని ఆయనకు తుంటి మార్పిడి శస్త్తచికిత్స చేశారు.దీంతో  పలువురు ప్రముఖులు కేసీఆర్‌ను పరామర్శించేందుకు యశోధ హాస్పటల్‌కు చేరుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేసీఆర్‌ను పరామర్శించేందుకు మరి కాసేపట్లో యశోధ హాస్పటల్‌కు రానున్నట్లు తెలుస్తోంది. కాగా అక్కడ ఆయన తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నట్లు సమాచారం.