Andhra PradeshHome Page Slider

ఏపీ మాజీ సీఎం అసెంబ్లీకి రావాలి:మంత్రి పయ్యావుల

ఏపీ శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ నెల 21 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పయ్యావుల అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్ల ఫైలుపై తన తొలి సంతకాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రజల కోసం,ప్రజా సంక్షేమానికి అనేలా నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా ఏపీ మాజీ సీఎం జగన్ కూడా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరుకుంటున్నామన్నారు. అయితే ఈ శాసనసభ స్వపక్షమైనా,విపక్షమైనా మేమే అని మంత్రి వెల్లడించారు. కాగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉన్నామని మంత్రి పయ్యావుల కేశవ స్పష్టం చేశారు.