Andhra PradeshHome Page Slider

బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో బీజేపీ పెద్దల  సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఆయనను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ కండువా  కప్పి ఆహ్వానించారు. కేంద్ర స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్థాయి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కొంతకాలం ముందటే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు.  కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్ర పెద్దలతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. దీనితో ఏపీ, తెలంగాణాలుగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్.

 దీనితో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, సమైఖ్యాంధ్ర పార్టీని పెట్టారు. కానీ సీట్లు రాకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నిర్ణయాల వల్ల ఏపీ పూర్తిగా నష్టపోయిందని, తానెప్పుడూ కాంగ్రెస్‌ను వీడతాననుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారని, ఏపీలో ఆయన వల్ల బీజేపీ బలపడుతుందని ప్రహ్లాద్ జోషి ఆకాంక్షించారు.