పోలీసులు, అధికారులపై జగన్ ఆగ్రహం
పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. పోలీసులు, అధికారులపై జగన్ ఫైర్ అయ్యారు. ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు నోట్ చేసుకోండని వైసీపీ నేతలకు జగన్ తెలిపారు. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడానికే కానీ, అధికారంలో ఉన్నవారికి సలాం కొట్టడానికి కాదని హితవు పలికారు. ఈ భేటీకి హాజరైన అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలానికి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో జగన్ చర్చిస్తున్నారు.


 
							 
							