Andhra PradeshHome Page Slider

వైసీపీకి రాజీనామా చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. చీరాల నియోజకవర్గ శ్రేయస్సు, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తానని ఆయన ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 9న ప్రజల పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా లేదంటే కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఆయన చీరాలలో గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగానూ, స్వతంత్ర అభ్యర్థిగానూ విజయం సాధించారు.