తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు తీవ్ర ఇబ్బంది తలెత్తిందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు బుద్ధదేవ్ భట్టాచార్య. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, అన్నిరకాల పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు వైద్యులు. ఆయన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉండేవారు. ఆయన పశ్చిమ బెంగాల్‌కు రెండవ ఉప ముఖ్యమంత్రిగా, ఏడవ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనకు ప్రస్తుతం 79 ఏళ్ల వయస్సు. స్వయంగా ఊపిరి తీసుకోలేకపోతున్నారని, వెంటిలేటర్ సదుపాయంపై ఆయనను ఉంచినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నారు. ఆయన 2018లో రాజకీయ సన్యాసం చేశారు.

