విద్యుత్ విచారణ కమిటీ ఛైర్మన్‌గా మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తెలంగాణ విద్యుత్ విచారణ కమిటీకి రాష్ట్రప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మదన్ భీమ్ రావ్ లోకూర్‌ను కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఇంతకు ముందు ఛైర్మన్‌గా పని చేసిన జస్టిస్ నరసింహారెడ్డిని మార్చమంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. నరసింహారెడ్డిపై కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.