Home Page SliderTelangana

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై మంత్రి అనుచరుల దాడి..

నల్గొండ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య బాహా బాహి జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ రైతు ధర్నా ఇవాళ జరగాల్సి ఉండగా.. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 24 వరకు గ్రామ సభలు ఉండటంతో సెక్యూరిటీని కేటాయించాలని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి చెందిన మంత్రి కోమటి రెడ్డి అనుచరులు.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై దాడి చేశారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల ముందే మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.