బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) సంచలన తీర్పు వెలువరించింది. ఢాకా అల్లర్ల కేసులో పలువురు నిరపరాధులను కాల్చిచంపాలని ఆదేశాలు జారిచేసినట్లు కోర్టు నిర్ధారించింది.
న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ, “షేక్ హసీనా తీరు మానవత్వానికి మచ్చ” అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. అల్లర్ల సమయంలో అమాయక పౌరులపై జరిగిన కాల్పులకు, హింసకు ఆమె నేరుగా బాధ్యత వహించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రస్తుతం షేక్ హసీనా భారత్లోనే ఆశ్రయం తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్లో ఆమెపై అల్లర్ల, అక్రమ ఆదేశాల, మానవ హక్కుల ఉల్లంఘన కేసులు నమోదైన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా కుదిపేసిన ఈ తీర్పుపై అంతర్జాతీయంగా స్పందనలు రావడం ప్రారంభమైంది.

