Home Page SliderTelanganatelangana,

ఫుడ్ పాయిజన్‌పై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..

ఇటీవల తెలంగాణ గురుకులాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషయంపై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ పాయిజన్ వ్యవహారాలు ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీరు విద్యార్థులను కలిసి, వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, హాస్పిటల్స్‌లో తనిఖీలు చేసి, నిర్వాహకులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంటారు.