బంగ్లాదేశ్ పరిస్థితులపై విదేశాంగమంత్రి కీలక వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో సంక్షోభ పరిస్థితులపై భారత విదేశాంగమంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై దాడులు జరుగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో భారతీయ విద్యార్థులకు ప్రమాదమేమీ లేదని, చాలామంది జూలైలోనే స్వదేశానికి వచ్చేశారని పేర్కొన్నారు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. జనవరిలో ఎన్నికలు జరిగినప్పటినుండి అక్కడ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు ఉన్నారు. దౌత్యవేత్తల ద్వారా అక్కడున్న భారతీయులతో మాట్లాడుతున్నామని, మైనారిటీల పరిస్థితులను గమనిస్తున్నామని పేర్కొన్నారు. కొన్నిచోట్ల ఆలయాలు, వ్యాపార కేంద్రాలపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అక్కడి రాజకీయ పార్టీలకు ముందే చెప్పామని పేర్కొన్నారు. షేక్ హసీనా రాజీనామా అనంతరం భారత్‌కు వచ్చేందుకు ఫ్లైట్ క్లియరెన్స్ కోసం అధికారులు అభ్యర్థించారని పేర్కొన్నారు. ఆమె సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారని పేర్కొన్నారు.