ఢిల్లీ విమానాశ్రయంలో 10 కోట్లకు పైగా విలువగల విదేశీ కరెన్సీ లభ్యం
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 కోట్ల రూపాయలకు పైగా విలువగల విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇస్తాంబుల్ వెళుతున్న ముగ్గురి లగేజిని సోదా చేయగా, వారివద్ద లగేజిలోని బూట్లలో విదేశీ కరెన్సీని గుర్తించారు. వారి ముగ్గురు వద్ద మొత్తంగా 7,20,000 అమెరికన్ డాలర్లు, 4, 66,200 యూరోలు అధికారులు గుర్తించారు. భారత్ కరెన్సీలో వీటి విలువ దాదాపు 10.6 కోట్ల రూపాయలుంటుందని అంచనాలు వేశారు. వీరు ముగ్గురిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. వీరు కజకిస్తాన్‌కు చెందినవారని గుర్తించారు. వీరివద్దకు ఇంతమొత్తంలో విదేశీ కరెన్సీ ఎలా వచ్చిందనే విషయంపై ఆరాలు తీస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ సాధారణమే కానీ ఇంతమొత్తంలో కరెన్సీ నోట్లు దొరకడం ఇదే మొదటిసారని కస్టమ్స్ వారు చెపుతున్నారు.