Home Page SliderNational

పార్టీ కంచుకోటలో 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీకి ప్రతికూల పరిస్థితులు

మరో రెండు వారాల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో అక్కడ రాజకీయం వేడెక్కుతోంది. బెంగళూరు అర్బన్ తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన బెలగావి జిల్లాలో లింగాయత్ వర్గం ప్రభావం గణనీయంగా ఉంది. రాజకీయాలు, స్థానిక సమస్యలను అధిగమిస్తున్నందున బీజేపీ-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ కన్పిస్తోంది. సరిహద్దు సమస్యను సజీవంగా ఉంచాలనుకుంటున్నందున, మహారాష్ట్ర ఏకీకరణ సమితి (MES) కొన్ని స్థానాల్లో గెలుపు ఓటములపై తీవ్రంగా ప్రభావం చూపించవచ్చు. లింగాయత్‌లకు కంచుకోటగా ఉన్న సరిహద్దు జిల్లాలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఈ ప్రాంతం ఉంది. ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. గత మూడు ఎన్నికల మాదిరిగానే, బెలగావి, ఇతర మరాఠీ ఏరియాల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య డైరెక్ట్ వార్ ఉండేది. శివసేన-ఎన్‌సీపీ, మహారాష్ట్ర ఏకీకరణ సమితికి (MES) మద్దతిస్తోన్నందున ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఓటములను అంచనా వేసే పరిస్థితి కన్పించడం లేదు. మరాఠి మాట్లాడే ప్రాంతాల్లో MES స్థానిక అభ్యర్థులను నిలబెట్టింది.

బీఎస్ యడియూరప్పను తప్పించిన తర్వాత లింగాయత్ కమ్యూనిటీలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. సురేశ్ అంగడి, ఉమేష్ కత్తి వంటి ప్రముఖ స్థానిక లింగాయత్ బిజెపి నాయకుల మరణాలతో ప్రతికూల పరిస్థితులు ఎర్పడ్డాయి. షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందిన రాజకీయంగా ప్రభావవంతమైన జార్కిహోళి కుటుంబానికి ఓటర్లలో పలుకుబడి పెరుగింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడితో సహా అనేక మంది అసంతృప్త బీజేపీ నాయకులు పార్టీని వీడటంతో ఇక్కడ ఈసారి భారీగా ఓట్లు చీలే అవకాశం ఉంది. మరోవైపు, దాదాపు 40 శాతం మరాఠీ మాట్లాడే జనాభా కలిగిన, పూర్వపు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావిలో సరిహద్దు సమస్యను సజీవంగా ఉంచడానికి MES తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముక్కోణపు పోరు ఐదు మరాఠీ మాట్లాడే ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో జాతీయ పార్టీల ఓట్లను చీల్చడం ఖాయంగా కన్పిస్తోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మరాఠాల ఆధిపత్యం ఉండగా, మిగిలిన 13 నియోజకవర్గాల్లో లింగాయత్‌లు మెజారిటీగా ఉన్నారు. బెలగావిలో OBC, SC/STలు కూడా గణనీయమైన జనాభాను కలిగి ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రెండు రిజర్వ్ సీట్లున్నాయి. జిల్లాలో, అనేక మంది ప్రజాప్రతినిధులు చక్కెర వ్యాపారులుగా ఉన్నారు, మూడు శక్తివంతమైన రాజకీయ కుటుంబాలు, జార్కిహోలీలు, జొల్లెలు, ఖట్టీలు… జిల్లాలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

జార్కిహోళి కుటుంబం నుంచి గోకాక్‌ నుంచి రమేశ్‌ జార్కిహోళి, ఆరభావి నుంచి బాలచంద్ర జార్కిహోళి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. కుటుంబానికి చెందిన మరో సభ్యుడు సతీష్ జార్కిహోళి యెమకనమర్డి స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. జార్కిహోళి సోదరులు తాజాగా పార్టీ మారారు. బీజేపీ శ్రేణుల్లో చేరడానికి ముందు రమేష్ జార్కిహోళి కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కాంగ్రెస్ నుండి ఫిరాయించిన 17 మంది ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఉన్నారు. కాంగ్రెస్ నుండి ఫిరాయించి, బీజేపీ టికెట్ సాధించడంతో నియోజకవర్గంలో రోజు రోజుకు జార్కిహోళి బ్రదర్స్ పట్టు సాధించారు. ఇది సాంప్రదాయ పార్టీ నాయకులను ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థి లక్ష్మణ్ సవాడిని కలవరపెట్టింది. నిప్పాణి నియోజకవర్గం, బీజేపీ టిక్కెట్‌పై మరో ప్రముఖ కుటుంబం జొల్లె. ప్రస్తుతం మత, ధర్మాదాయ శాఖ మంత్రిగా శశికళ జొల్లె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె భర్త అన్నా సాహెబ్ జోల్లె బెలగావి జిల్లాలోని చిక్కోడి నుండి బీజేపీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009-2014 వరకు చిక్కోడి పార్లమెంటరీ నియోజకవర్గానికి రమేష్ ఖట్టి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఈసారి చిక్కోడి-సదలగా ఎమ్మెల్యే స్థానం నుండి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. రమేష్ ఖట్టి మేనల్లుడు నికిల్ కత్తి తండ్రి ఉమేష్ ఖట్టి అకాల మరణంతో హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఉమేష్ ఖట్టి, ఎనిమిది సార్లు ఎమ్మెల్యే, ఆరు సార్లు మంత్రిగా వ్యవహరించారు.

టికెట్ నిరాకరించడంతో బీజేపీని వీడిన లక్ష్మణ్ సవాది బీజేపీ నుంచి ముఖ్యంగా రమేశ్ జార్కిహోళి నుంచి తనకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అథని అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. లక్ష్మణ్ సవాడీ, మహేష్ కుమతల్లిని ఎదుర్కొంటున్నారు. అప్పుడు కాంగ్రెస్‌లో, ఇప్పుడు బీజేపీ అభ్యర్థి రమేష్‌కు బెలగావి రూరల్ స్థానం నుండి పోటీ చేస్తున్న లక్ష్మీ హెబ్బాల్కర్ వంటి కొంత మంది కాంగ్రెస్ నాయకులతో విభేదాలు ఉన్నాయి. వీరిద్దరూ వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నప్పటికీ వ్యక్తిగత ద్వేషాలను తీర్చుకునేందుకు ఒకరినొకరు ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బెళగావి జిల్లాలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39.01 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 19,68,928 మంది పురుషులు, 19,32,576 మంది మహిళలు, 141 మంది ఇతరులుగా నమోదైనట్లు అధికారిక సమాచారం. 2018 ఎన్నికలలో, బీజేపీ పది స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 8 స్థానాలను గెలుచుకుంది. 2019 లో ఫిరాయింపుల తర్వాత సిట్యువేషన్ మారిపోయింది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు – రమేష్ జార్కిహోలి (గోకాక్), మహేష్ కుమతల్లి (అథాని), శ్రీమంత్ పాటిల్ (కాగ్వాడ్) రాజీనామా చేసి బీజేపీలో చేరారు.