Home Page SliderInternational

“నాకు ‘ఏఐ’ అంటే అమెరికా, ఇండియా”..మోదీ కీలక వ్యాఖ్యలు

భారత ప్రధాని మోదీ అమెరికా టూర్‌లో భాగంగా దిగ్గజ ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. ఆయన వారితో మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రముఖ ఆవిష్కర్తలతో కలిసి కూర్చోవడం చాలా గర్వంగా ఉందన్నారు. అమెరికాతో భారత్‌కు ఉన్న సత్సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనకు ఏఐ అంటే అమెరికా, ఇండియా అన్నారు. భారత్‌పై మీకున్న నమ్మకం నాకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. గూగుల్, అడోబ్, ఎన్విడియా వంటి 15 ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు మోదీ. టెక్నాలజీ, ఇన్నోవేషన్ అంశాల గురించి ప్రస్తావించారు. మేడ్ బై ఇండియా ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ ప్రధాని మోదీకి భారత్‌ను మార్చడంపై స్పష్టమైన విజన్ ఉందని కొనియాడారు. తమ కంపెనీ పిక్సెల్ ఫోన్లను ఇండియాలో తయారు చేయడం గర్వంగా ఉందన్నారు. భారత్‌లో తయారీ, డిజైనింగ్ ఉండాలని ప్రధాని కోరారని పేర్కొన్నారు. ఏఐ సాంకేతికత సహాయంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ఉపయోగపడే ఆవిష్కరణలు చేయమని కోరారని పేర్కొన్నారు.