హాస్టల్ విద్యార్థుల కోసం..వార్డెన్ సాహసం
విజయనగరం జిల్లాలో ఓ హస్టల్ వార్డెన్ విద్యార్థుల కోసం పెద్ద సాహసమే చేసింది. ఇటీవల ఎడతెరిపి వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలోని వాగులు ,వంకలు పొంగి పొర్లుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని చంపావతి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే విజయనగరం జిల్లాలో ఓ మహిళ హస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆమె రెండు రోజుల క్రితం వ్యక్తిగత పని మీద వేరే ఊరికి వెళ్లారు. ఆమె వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న చంపావతి వాగుకి భారీగా వరద నీరు చేరడంతో అది పొంగి ప్రవహిస్తుంది. కాగా ఆమె హస్టల్ విద్యార్థుల కోసం ఆందోళన చెందింది. ఈ మేరకు ఆమె విద్యార్థుల కోసం ఎంతో ధైర్యంగా చంపావతి నదిని దాటింది. ఆమె ఈ నదిని దాటేందుకు తన సోదరుల సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఆమె విద్యార్థుల కోసం చేసిన సాహసాన్ని చూసి అందరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.