30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తూనే ఉన్నారు
కోట్లాది మంది తెలుగు ప్రజల సాక్షిగా తనని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారని ఆ విషయం తెలిసినా కొంత మంది దుర్మార్గులు 30 ఏళ్లుగా ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారని నారా,నందమూరి కుటుంబీకుల్లో కొందరిపై ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి పరోక్ష వ్యాఖ్యలు చేసి కన్నీటి పర్యంతమయ్యారు.ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌కి నివాళులు అర్పించేందుకు వచ్చిన లక్ష్మీపార్వతి.. సమాధి వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఎన్టీఆర్ ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సేవ చేశానని.. చివరికి కొందరి కుతంత్రాల వల్ల ఆయన తనని వదిలేసి వెళ్ళిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.తనని ఈ వయసులోనూ కొంత మంది దుర్మార్గులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన ఉసురు వాళ్లకి కచ్చితంగా తగులుతుందని మీడియాకి చెప్పి వాపోయారు.