Home Page SliderInternational

సరికొత్త రికార్డు సృష్టించిన ఫుట్ బాల్ లెజెండ్ ‘రోనాల్డో’

పేరు పొందిన పోర్చుగీస్ ఫుట్ బాల్ ప్లేయర్, ఆల్ టైమ్ అందరి ఫేవరేట్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏకంగా 200 అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడి మునుపెవ్వరూ సాధించని రికార్డు నెలకొల్పాడు. UEFA 2024 క్వాలి ఫయింగ్ కోసం ఐస్‌ల్యాండ్‌తో పోర్చుగల్ తలపడింది. ఈ మ్యాచ్ ఆడిన రొనాల్డో తాను చేసిన గోల్ ద్వారా పోర్చుగల్‌ను 1-0 తేడాతో గెలిపించాడు. దీనిద్వారా 200 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఘనత సాధించాడు. దీనిద్వారా 200 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఘనత సాధించాడు. అంతేకాదు ఎక్కువ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ క్యాప్‌లు సాధించిన పురుష ఆటగాడిగా కూడా ఖ్యాతి వహించాడు. దీనితో గిన్నిస్ రికార్డును సాధించాడు. అతని ఫ్యాన్స్ ఈ న్యూస్ విని సంబరాలు చేసుకుంటున్నారు.