Home Page SliderNational

రైలులో ఫుడ్ డెలివరీ.. షాకైన విదేశీయుడు

భారత్‌లో యూకే జాతీయుడైన ఓ యూట్యూబర్ పర్యటిస్తున్నాడు. ట్రావెలింగ్‌లో భాగంగా యూపీలో ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. రైలు స్టేషన్‌లో ఆగిన 5 నిమిషాల్లోనే డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేశాడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన సదరు యూట్యూబర్ యూకే భారత్‌ను చూసి నేర్చుకోవాలని పేర్కొన్నాడు. ఆ వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.