ఫుడ్ డెలివరీ బాయ్ గా మారిన సీఈఓకు చేదు అనుభవం
ఫుడ్ డెలివరీ బాయ్ గా వెళ్లిన జొమాటో సంస్థ సీఈఓ దీపిందర్ గోయలకు చేదు అనుభవం ఎదురైంది. సిబ్బంది సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గురుగ్రామ్ లో ఆయన డెలివరీ బాయ్ అవతారమెత్తారు. సెకండ్ ఆర్డర్ ను తీసుకునేందుకు ఓ మాల్ లోకి వెళ్తుండగా.. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తనను లిఫ్ట్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, మెట్ల మార్గంలో వెళ్లాలని చెప్పారని పేర్కొంటూ ఓ వీడియోను ఎక్స్ పోస్ట్ చేశారు. హల్దిరామ్స్ ఆర్డర్ ను పిక్ చేసుకునేందుకు మాల్ కు వెళ్లగా తనకు ఇలాంటి అనుభవం ఎదురైందన్నారు. తాను మెట్ల మార్గంలోనే మూడవ అంతస్తుకు వెళ్లి ఆర్డర్ తీసుకుని వెళ్లానని తెలిపారు. ఈ సంఘటనతో డెలివరీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మాల్స్ తో కలిసి జొమాటో మరింత క్లోజ్ పనిచేయాల్సి ఉందన్న విషయం తనకు అర్థమైందని పేర్కొన్నారు.