పైలట్ లేకుండానే విమాన ప్రయాణం!
పైలట్ లేకుండానే విమాన ప్రయాణం ఎలా అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇదీ నిజం. డ్రైవర్ లెస్ కార్లలాగే పైలట్ లెస్ విమానాలు కూడా భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ సాయంతో ప్రపంచంలోనే తొలి ఏఐ పైలట్ లెస్ ప్లేన్ ను తయారు చేసేందుకు రెండు ప్రముఖ కంపెనీలు జతకట్టాయి. బ్రెజిల్ కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ ఎంబ్రాయెర్, కెనడాకు చెందిన బాంబార్డియర్ కంపెనీ కలిసి పైలట్ లెస్ విమానాన్ని అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించాయి. ఈ విమానంలో ప్యాసింజర్లు కాక్ పిట్లో (విమానాల్లో పైలట్లు కూర్చునే ప్రదేశం) కూడా కూర్చుని జర్నీ చేయవచ్చు.