వయనాడ్‌లో డ్రోన్ రాడార్లతో గాలింపు
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో తప్పిపోయిన వారిని కనిపెట్టే ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. వారిని రక్షించడానికి సహాయక చర్యలను అధికం చేశారు. శిథిలాల కింద, మట్టిపెళ్లల కింద ఎవరైనా సజీవంగా ఉన్నారేమో అనే ఉద్దేశంతో డ్రోన్ ఆధారిత రాడార్లతో అన్వేషణ చేస్తున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 300 దాటింది. ఇంకా 300 మంది జాడ కనిపెట్టలేకపోయామని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. వయనాడ్ విపత్తు ప్రాంతాన్ని ఆరు జోన్లుగా విభజించి, 40 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ బృందాలలో సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, తీర రక్షక దళం కలిసి కట్టుగా పనిచేస్తున్నాయి.

