NationalNewsTrending Today

బెంగళూరు వాసులకు ఎగిరే ట్యాక్సీలు

త్వరలోనే బెంగళూరు నగరంలో ఎగిరే ట్యాక్సీలు ప్రయాణించబోతున్నాయి. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. విమానాశ్రయం, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రదేశాలలో అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరడానికి ఈ ట్యాక్సీలు బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు తక్కువ ఎత్తులో పర్యావరణానికి హాని లేకుండా ప్రయాణ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు మరో రెండేళ్లు పడుతుందని సార్లా ఏవియేషన్ సీఈఓ అడ్రియన్ స్మిత్ తెలిపారు. ఇవి సాధారణ హెలికాఫ్టర్ల కంటే వేగంగా ప్రయాణిస్తాయని పేర్కొన్నారు.