Home Page SliderTelangana

మేడిగడ్డకు వరద పోటు

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నుండి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీకి 14,500 క్యూసెక్కుల మేర ప్రవాహం రాగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) సూచన మేరకు పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్లు దిగువకు వెళుతోంది. వరద రావడంతో పనుల కోసం తెచ్చిన యంత్రాలు, సామగ్రిని తరలించారు.