ఇస్రోలో బీటెక్ అర్హతతో ఉద్యోగాల వెల్లువ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO లో భారీగా ఉద్యోగావకాశాలు ప్రకటించారు. బీటెక్ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయవచ్చు. వీటిలో అసిస్టెంట్ ఇంజనీర్లు, సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 303 పోస్టులకు గాను ఇస్రో సెంట్రల్ రిక్రూట్‌మెంట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుండి జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఎలక్ట్రానిక్ ఇంజనీర్ లేదా సైంటిస్ట్ పోస్టులు 90 కాగా, మెకానికల్ 163, కంప్యూటర్ సైన్స్ 47, ఎలక్ట్రానిక్స్ అటానమస్ బాడీ-2, కంప్యూటర్ సైన్స్ అటానమస్ బాడీ-1 పోస్టు చొప్పున విడుదల చేశారు. వీటికి అప్లై చేయాలంటే కనీసం 65 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌లలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు రుసుము 250 రూపాయిలు. వయస్సు 2023 జూన్ 14 నాటికి 28 ఏళ్లు మించరాదు. వయోపరిమితి సడలింపు ప్రభుత్వ నియమాలననుసరించి ఉంటాయి. ప్రారంభవేతనం నెలకు 56 వేల రూపాయల పైనే ఉంటుంది.
వివరాలకు apps.ursc.gov.in/CentralBE-2023/advt.jsp అనే లింకును చూడవచ్చు.