Home Page SliderNational

45 ఏళ్ల తర్వాత మళ్లీ తాజ్‌మహల్‌ను తాకిన వరద

దేశ రాజధాని ఢిల్లీ దగ్గరలో ఉన్న ఆగ్రాలో నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం  “తాజ్‌మహాల్” షాజహాన్-ముంతాజ్ ప్రేమకు ప్రతీకనే విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా ఈ తాజ్‌మహల్ ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా నిలిచింది. అయితే అలాంటి తాజ్‌మహల్‌ వద్దకు కూడా వరద నీరు చేరింది. కాగా ఉత్తరాది రాష్ట్రాల్లో గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి మరి ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎర్రకోట,సుప్రీంకోర్టు,ఢిల్లీ సీఎం కేజ్రివాల్ నివాసం వరద నీటిలో చిక్కుకున్నాయి. అయితే ఇప్పుడు తాజ్‌మహల్‌ను కూడా వరద నీరు తాకినట్లు తెలుస్తోంది. కాగా తాజ్‌మహల్ వెనుక గోడలను వరద నీరు తాకింది.చివరిసారి 1978లో అధికంగా వరదలు సంభవించినప్పుడు కూడా ఇలానే తాజ్‌మహల్ వెనుక గోడల వరకు వరద వచ్చిందంట. అయితే మల్లీ 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇలా జరిగింది అని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.