Andhra PradeshHome Page Slider

ఈ ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ఇంకా వీడలేదు. ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్ జారీ చేశారు. రేపు ఉదయం 12 గంటల వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయని, ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పేర్కొన్నారు.