చార్మినార్ నుంచి ఊడిపడిన పెచ్చులు
చార్మినార్ వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు మినార్ నుంచి పెచ్చులు ఊడిపడడంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. ఈ మినార్ కు అధికారులు గతంలో రిపేర్లు చేసినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలోనూ పెచ్చులు ఊడితే అధికారులు మరమ్మతులు చేశారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. మినార్ కు మరోమారు మరమ్మత్తులు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.