విజయానికి ఐదు వికెట్ల దూరంలో…
భారత్ -ఆస్ట్రేలియా బోర్డర్-గావస్కర్ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. టీమిండియా విజయానికి ఐదు వికెట్ల దూరంలో దూసుకుపోతోంది. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో అసీస్‌కు భారీ దెబ్బ తగిలింది. 79 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి, కష్టాల్లో పడింది. భారత్ స్టార్ బౌలర్లు బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. అయితే అసీస్ ఇంకా మిగిలిన 5 వికెట్లలో 396 పరుగులు చేయాల్సి ఉంది. ట్రావిస్ హెడ్ క్రీజులో ఉండగా, నాతన్, ఖవాజా, కమిన్స్, లబుషేన్, స్టీవెన్ స్మిత్ ఔటయ్యారు.