మట్టి దిబ్బ కూలి ఐదుగురు మృతి..
ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మట్టి దిబ్బ కూలిపోయి ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కోఖ్రాజ్ పీఎస్ పరిధిలోని టికార్దిహ్ గ్రామానికి చెందిన మహిళలు తమ ఇళ్ల ప్లాస్టరింగ్ పనుల కోసం గ్రామం వెలుపల ఉన్న ఒక గుట్ట నుండి మట్టిని తవ్వడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.

