Home Page SliderInternational

స్పేస్‌లో పెరిగిన చేపలు

స్పేస్‌లో చేపలు పెంచి చైనా అరుదైన ఘనతను సాధించింది. చైనా అంతరిక్ష కేంద్రంలో షెన్‌ఝౌ-18 అనే స్పేస్ మిషన్‌లో భాగంగా వారు ఈ ప్రయోగం చేశారు. దీనికోసం జీబ్రా జాతి చేపలను ఎంచుకున్నారు. వాటిని అంతరిక్ష కేంద్రం లోపల అన్ని వసతులతో కూడిన క్లోజ్డ్ ఎకో సిస్టంలో పెంచారు. ఈ చేపలు 43 రోజుల పాటు అక్కడ పెరిగి, పెద్దవై పునరుత్పత్తి కూడా జరిపాయి. దీనితో ఇది సరికొత్త రికార్డుగా నిలిచింది. వాతావరణమే లేని అలాంటి చోట జీవులు ఏ మేరకు మనుగడ సాగించగలవో చాలా స్పష్టత వచ్చిందని సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ జీబ్రా చేపలకు జన్యుపరంగా మనుషులతో దగ్గరి పోలికలుండడం వలన సమీప భవిష్యత్తులో మానవులు భూమికి ఆవల కూడా శాశ్వత నివాసం ఏర్పాటుకు జరగే ప్రయత్నాలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు సైంటిస్టులు.